యాంటీజెన్ పరీక్షనే నమ్ముకోవద్దు.. లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్ కు వెళ్లాలి: వైద్యుల సూచన

12-01-2022 Wed 13:38 | National
  • బాగా అమ్ముడుపోతున్న యాంటీజెన్ టెస్ట్ కిట్లు
  • రెగ్యులర్ ఆర్టీపీసీఆర్ పరీక్షే మెరుగైనదంటున్న వైద్యులు
  • ఇందులోనే అధిక శాతం కచ్చితమైన ఫలితాలు వస్తాయంటున్న నిపుణులు 
కరోనా ఒమిక్రాన్ లో కనిపిస్తున్న ప్రధాన లక్షణాలు జలుబు, దగ్గు, గొంతులో సమస్య. దీంతో చాలా మంది ఈ లక్షణాలు కనిపించగానే ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్ట్ కిట్ తో ఇంటి వద్దే స్వయంగా పరీక్షించుకుంటున్నారు. దీనికి నిదర్శనం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు గణనీయంగా అమ్ముడుపోతుండడమే. పెరిగిన డిమాండ్ ను అవకాశంగా తీసుకుని కొన్ని ఫార్మసీ స్టోర్లు రూ.600 వరకు అమ్ముతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ కిట్ల ధర రూ.200-250 మధ్యే ఉంది.

పూర్వపు రెండు విడతల్లోనూ బాధితులు ఇంటి వద్ద టెస్ట్ కిట్లతో పరీక్షించుకోవడం పెద్దగా లేదు. కానీ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన తర్వాత రిటైల్ స్టోర్లలో టెస్ట్ కిట్లను కొనుగోలు చేసే వారు పెరిగినట్టు ఫార్మా డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. కానీ, చాలా మందికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ల గురించి అవగాహన లేదు. సరైన విధానంలో శాంపిల్ సేకరించి పరీక్షించుకున్నప్పుడే ఫలితాలు కచ్చితత్వంతో వస్తాయి.

వినియోగానికి అనుకూలంగా ఉండడం, అదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ ఉండడం, ఆర్టీపీసీఆర్ ఫలితాలు వెంటనే రాకపోవడం, టెస్ట్ ఖరీదు ఎక్కువగా ఉండడం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లకు డిమాండ్ పెరగడానికి కారణాలుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

కానీ, వైద్య నిపుణులు సొంతంగా కరోనా పరీక్ష చేసుకోవడం మెరుగైన ఆప్షన్ కాదంటున్నారు. రెగ్యులర్ టెస్ట్ ను వెంటనే చేయించే అవకాశం లేనప్పుడే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ తో పరీక్షించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ‘‘ఇంటి వద్ద చేసుకున్న పరీక్షలో ఒకవేళ ఫలితం నెగెటివ్ గా వచ్చి.. లక్షణాలు కనిపిస్తుంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఈ విధానమే మెరుగైనది’’ అని అపోలో వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ చెప్పారు.
test Kitscoronartpcrrapid antigen

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more